మీసేవ ఆపరేటర్ల తొలగింపు పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి..

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; మీసేవ ఆపరేటర్ల తొలగింపు పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని తెలంగాణ రెవెన్యూ సర్వీస్ సెస్ అసోసియేషన్ ( టీజీఆర్ ఎస్ ఏ ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఏం బాపూరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా తాహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న మీ సేవ ఆపరేటర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉపాధి పొందుతున్న ఆపరేటర్ల కుటుంబాలలో నిరాశ నిస్పృహాలు చోటు చేసుకున్నాయన్నారు.
గ్రామీణ ప్రాంతాలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ డబ్ల్యూఎస్ రైతులకు గాను అత్యవసరమైన కుల, ఆదాయ, నివాస సర్టిఫికెట్స్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా అమలులో కీలక పాత్ర పోసిస్తున్న ఈ ఆపరేటర్లని తొలగించడం న్యాయం కాదని తద్వారా తీవ్రమైన జాప్యం జరిగే అవకాశం ఉన్నందున త్వరితగతిన ప్రజలకు ధ్రువీకరణ పత్రములు, సంక్షేమ కార్యక్రమాలు అమలులో ప్రధాన పాత్ర పోషించే మీ సేవ ఆపరేటర్ల తొలగింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేంత వరకు మీసేవ ఆపరేటర్లకు తోడుగా ఉంటూ ప్రభుత్వంలో భాగస్వాములైన ఎమ్మెల్యేలు ఎంపీలను కలిసి విజ్ఞప్తిలను అందజేస్తామని టీజీఆర్ ఎస్ ఏ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఏం బాపూరావు పేర్కొన్నారు.
