పొద్దు పొడుపు.. బొజ్జన్నఅడుగు..

పొద్దు పొడుపు.. బొజ్జన్నఅడుగు..

ఉట్నూర్, ఆంధ్రప్రభ – ఆదిలాబాద్ జిల్లా (Adhilabad) ఉట్నూర్ పట్టణ కేంద్రంలో పొద్దు పొడుపు.. బొజ్జన్నఅడుగు… అంటూ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ (MLA Bojju Patel) ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం ఉట్నూర్ పట్టణంలోని సుభాష్ నగర్, (Subhash Nagar) సేవదాస్ నగర్, పోచమ్మ గల్లీ, పకీర్ గుట్ట మెయిన్ రోడ్ లో ఎమ్మెల్యే మార్నింగ్ చేస్తూ ప్రజలను పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. సమస్య ఉన్న చోట వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం దిశగా తన ప్రణాళికను తెలియచేశారు.

అవసరం ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్లు, నూతన వాటర్ ట్యాంక్స్, అంగడి బజార్, అలాగే ఐబీ ప్రాంతాల్లో సులభ్ కాంప్లెక్స్ ల నిర్వహణకు స్థలం పరిశీలించారు. ఐబీ, వేణునగర లకు నూతన సీసీ రోడ్లు, వాకింగ్ లో భాగంగా మండల కేంద్రంలోనీ కేజీబీవి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. మెస్, వసతి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కష్ట పడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉట్నూర్ డి ఈ పవార్ రమేష్, ఉట్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఏక్బాల్, కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) సయ్యద్ నిసార్, హజి మో ద్దీన్ హైమద్, రాజేష్ జాదవ్, ప్రభాకర్ రెడ్డి, ఖయ్యూం, ఆన్సర్, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply