AP | కార్పొరేషన్ చైర్మన్లకు జీతాలు ఖరారు !
- ఏ కేటగిరి చైర్మన్లకు రూ 2.77,500
- బి కేటగిరి చైర్మన్లకు రూ 1,93,500
- డైరెక్టర్లకు నెలకు రూ 20 వేలు
అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, ఆర్గనైజేషన్ల చైర్మన్లకు జీతాలు, అలవెన్సులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కార్పొరేషన్లు, వివిద సంస్థలను ఏ,బి కేటరిగా విభజించి వేతనాలు నిర్ణయించారు.
ఏ కేటగిరి చైర్మన్లకు నెలకు రూ 1.25 లక్షల జీతంతో పాటు ఇతర అలవెన్సులు కలిపి రూ 2,77,500, బి కేటగిరి చైర్మన్లకు నెలకు రూ 60 వేల జీతం, ఇతర అలవెన్సులు కలుపుకుని మొత్తం రూ 1,93,500లను ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.
ఏ,బి కేటగిరిల్లోని కార్పొరేషన్ల డైరెక్టర్లకు నెలకు అన్ని అలవెన్సులను కలుపుకుని రూ 20 వేల జీతాన్ని ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేటగిరి చైర్మన్లు 39 మంది ఉండగా బి కేటగిరి చైర్మన్లు 42 మంది ఉన్నారు.