సడలిన వేదావతి వేగం

సడలిన వేదావతి వేగం
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : కర్నూలు(Kurnool) జిల్లాలో నదుల ప్రవాహాలు క్రమంగా తగ్గుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు అందిన డేటా ప్రకారం, తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుండి నదిలోకి విడుదల 205 క్యూసెక్కులు(Cusco)గా ఉంది. మెలగనూరు వద్ద వేదావతి నదికి (6710 క్యూసెక్కులు), ఇతర వాగుల నుంచి మొత్తం 60,035 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది.
మంత్రాలయం(Mantralayam) వద్ద 84,756 క్యూసెక్కులుగా, సుంకేశుల(Sunkesula) వద్ద 1,08,350 క్యూసెక్కులుగా ప్రవాహాలు నమోదయ్యాయి. నదుల ప్రవాహం సాధారణంగా తగ్గుముఖం పట్టిందని అధికారులు పేర్కొన్నారు. ఇక గాజులదిన్నేప్రాజెక్టు నుండి హంద్రీ నదిలోకి విడుదలలు లేవు. రిజర్వాయర్(Reservoir)లోకి ప్రవహిస్తున్ననీటి పరిమాణం గణనీయంగా తగ్గి 600 క్యూసెక్కులకు పరిమితమైంది.
క్యాచ్‌మెంట్(Catchment) మండలాల్లో వర్షపాతం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కర్నూలు నగరంలోని హంద్రీనది(Handri River)లో ప్రవాహం 30,050 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రవాహం కూడా క్రమంగా తగ్గుతోందని అధికారులు వెల్లడించారు.

