- ప్రజలకు పారదర్శకంగా పోలీస్ సేవలు
- మఠంపల్లి ప్రాంతంలో అంతర్ రాష్ట్ర సరిహద్దు పై ప్రత్యేక నిఘా
- జిల్లా ఎస్ పీ నరసింహ
మఠంపల్లి (ఆంధ్రప్రభ) : పోలీస్ స్టేషన్ ల వార్షిక తనిఖీలలో భాగంగా మఠంపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్ పీ నరసింహ తనిఖీ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు, ఎస్సై బాబు సిబ్బందితో కలిసి ఎస్పీ నరసింహ కు గౌరవ వందనంతో స్వాగతం తెలిపారు.
స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన నూతన వాహనాల షెడ్ ను ప్రారంభించి మొక్కలను నారు. అనంతరం సీసీ కెమెరా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్టేషన్ రికార్డ్స్, కేసుల దర్యాప్తు పెండింగ్ కేసుల వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భద్రత, అంతర్రాష్ట్ర సరిహద్దులపై నిఘా, అక్రమ రవాణా, ఫిర్యాదుల నిర్వహణ, డయల్ 100 కాల్స్ పై స్పందన, పాత నేరస్తులు రౌడీషీటర్ల కదలికలపై నిఘా మొదలగు అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్ పీ నరసింహ మాట్లాడుతూ… గతంతో పోలిస్తే నేరాలు, రోడ్డు ప్రమాదాలు దొంగతనాలు తగ్గాయన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించామని మఠంపల్లి ప్రాంతంలో 50 కి పైగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు. మఠంపల్లికి అంతర్రాష్ట్ర సరిహద్దు ఉన్నందున ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాము, జిల్లాలోకి వచ్చి పోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని అసాంఘిక వ్యక్తులు అనుమానిత వ్యక్తులు ఉంటే వారి వివరాలు పక్కగా నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

