ఆనాటి జోడీ రెడీ..
గ్రీకు వీరుడూ… నా రాకుమారుడూ… కళ్ళల్లోనె ఇంకా ఉన్నాడు… అంటూ నిన్నే పెళ్ళాడతా సినిమాలో టబూ చేసిన హడావుడి గుర్తుండే ఉంటుంది. కృష్ణవంశీ తీసిన ఆ సినిమాలో పాటలూ సీన్లూ ఇప్పటికీ సూపర్ హిట్టే…ఆ జంట డబుల్ హిట్టు. అదే జోరులో ఆ తర్వాత ఆవిడా మా ఆవిడే సినిమాలో కూడ జతకట్టి కనువిందు చేసారీ జంట. దాదాపు ముప్పై ఏళ్ళు గడిచిపోయింది కానీ ఎందుకనో ఈ సూపర్ హిట్ జంట కలిసి సినిమాలు చేయలేదనుకుంటున్న కింగ్ నాగార్జున, టబు అభిమానులకు కనువిందు చేయడానికి ముందుకొస్తున్నారట వీళ్ళిద్దరూ.
అదీ ఓ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ తో…కింగ్ నాగార్జున వందో సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణంలో, తమిళ దర్శకుడు రా.కార్తీక్ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. త్రివిక్రం దర్శకత్వంలో, అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ కి తల్లిగా నటించిన టబు పాత్ర చాలా గంభీరంగా కనిపించింది. మరి ఈ చిత్రంలో ఎలా కనిపించనుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

