వైభవంగా స్వామివారి కల్యాణం..

వైభవంగా స్వామివారి కల్యాణం..
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరుమలగిరి కొండ పై వెలసిన నామాల స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది.
ఈ కళ్యాణ వేడుకలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, శ్రీదేవి దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వామివారికి పట్టువస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఈఓ సాంబశివరావు నేతృత్వంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. చలువ పందళ్లు, తాగునీరు ప్రసాద వితరణ కార్యక్రమాలు సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు.
