గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జివన్ రామ్

గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జివన్ రామ్
- సర్పంచ్ వీరమళ్ళ శిరీషలోకేష్ గౌడ్
మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉప ప్రధాన మంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా సర్పంచ్ వీరమళ్ళ శిరీషలోకేషగౌడ్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ.. ఎంపీగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో అణగారిని వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు నల్ల చంద్రశేఖర్ గౌడ్, నాయకులు పందుల రాములు గౌడ్, మహేశ్వరం సతీష్, చెరుకు శ్రీరాములు గౌడ్, బట్టు చంద్రశేఖర్, ఈద రాములు, అమంచ రమేష్, యండి.అశ్వక్, నల్ల మధు, వీరమళ్ళ గణేష్ పాల్గొన్నారు.
