వైభవంగా శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కల్యాణం

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : మండలంలోని మాటేడు గ్రామంలో ఉన్న ప్రాచీనమైన, చారిత్రాత్మక కాకతీయ కట్టడాలైన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి, శ్రీ రాధా వేణుగోపాల స్వామి వారి ఆలయాల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఆదివారం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి ఎదురుకోళ్లు ఘనంగా నిర్వహించిన అనంతరం.. స్వామివారి కల్యాణ మహోత్సవంను వేద పండితులు కే.రమేష్ శర్మ శివ, శ్రీ శ్రీనివాస్, శ్రీ దేవయ్య శ్రీ క్రాంత్ వేదోక్తముగ కళ్యాణ తంతును ప్రవర , యజ్ఞోపవీతధారణ జీలకర్ర బెల్లం, మంగళ సూత్ర ధారణ తలంబ్రాలు తదితర కార్య క్రమాలు కనుల పండుగగా నిర్వహించారు.

కన్యాదాతలుగా దంపతు లు మాజీ సర్పంచ్ సునీత పినాక పాణి, జంగేటి శ్రీవల్లి సాయికుమా ర్ ,దుర్గరాజు లక్ష్మీ హైమా రజినీకాంత్ సహకరించారు . ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ డా. సుంక రనేని నాగవాణి మురళీకృష్ణ దంపతులు, గ్రామ సర్పంచ్ నాగరబోయిన సునీల్ కుమార్ ,దేవాలయాల చైర్మన్లు బుర్ర సురేష్ , బొల్లం లింగస్వామి, తొర్రూరు వ్యవ సాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పసుమర్తి శాంత సీతారాములు , సురేందర్ రాజు,నర్సింబాబు,ప్రవీణ్ రాజు,దినేష్ రాజు, సముద్రా శ్రీనివాస్ ,కొమురారెడ్డి,సూర హరికృష్ణ ,వల్లపు రమేష్, సంకటాల శ్రీనివాస్,నలమాస యాకయ్య భక్తులు సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Leave a Reply