పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం..

పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇటిక్యాల బాగా రెడ్డి అన్నారు. సోమవారం గ్రామానికి చెందిన భూపాల్ రెడ్డికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం మంజూరు కాగా చెక్కు రూపంలో బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వడ్ల బ్రహ్మానందం ఉప సర్పంచ్ పట్లూరి చైతన్య కొండల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టెంట్ హౌస్ స్వామి, దేవాదాయ శాఖ డైరెక్టర్ పెంజర్ల ఈశ్వర్ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు రాజా గౌడ్, వార్డ్ మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేయడం జరిగింది.
