మిర్యాలగూడ రూరల్ (ఆంధ్రప్రభ) : దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామానికి చెందిన రాఘవేంద్రప్రసాద్.. పద్మ దంపతులు.. విద్యార్థులకు దుస్తులు అందించే సేవాదృక్పథం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు.
మిర్యాలగూడ మండలంలోని ఆలగడప హైస్కూల్ లోని విద్యార్థులకు దసరా పండుగ కానుకగా రాఘవేంద్ర ప్రసాద్.. పద్మ దంపతులు అందించ సంకల్పించిన దుస్తులను శనివారం మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెంకట్ రెడ్డి,ఉపేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగరాజు యాదవ్, తదితరులు ఉన్నారు.

