వీఆర్ఏ లాలయ్య మృతి బాధాకరం..

మర్రిగూడ, ఆంధ్రప్రభ : దామర భీమనపల్లి గ్రామ రెవిన్యూ అసిస్టెంట్ కోరే లాలయ్య శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు శనివారం వారి అంత్యక్రియ ఖర్చులకు గాను ప్రభుత్వం తరుపున శ్రీనివాస్ నాయక్, సీనియర్ సహాయకుల వారి నివాసానికి వెళ్లి అతని పార్థివ దేహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ పంపిన రూ. 20 వేలను వారి కుటుంబ సభ్యులకు అందజేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. లాలయ్య కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు.
