బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్రం ఆమోదించాలి
నర్సంపేట, ఆంధ్రప్రభ : బీసీ రిజర్వేషన్లు (BC reservation) కేంద్ర ప్రభుత్వం ఆమోదించే వరకూ బీసీ నాయకులతో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పంజాల రమేష్ (Panjala Ramesh) అన్నారు. ఈ రోజు నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద బీసీ హక్కుల సాధన కోసం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని అన్నిపార్టీల శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారని, ఆ బిల్లును కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని, దాన్ని వెంటనే ఆమోదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, గుంపెల్లి మునీశ్వర్ ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు జిల్లా కౌన్సిల్ సభ్యులు, యాకయ్య సీపీఐ మండల కార్యదర్శి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పాలక కవిత, పిట్టల సతీష్, గడ్డం నాగరాజు, గడ్డం యాకయ్య, మాతంగి సురేష్, పద్మ, కమ్మల వెంకన్న, అరుణ,గుంటి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.