గ్రామ సభల ప్రధాన ఉద్దేశం అదే..

గ్రామ సభల ప్రధాన ఉద్దేశం అదే..

ఆళ్లపల్లి / గుండాల, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయా పంచాయతీల ప్రజలందరికీ చేరవేసేందుకు సెక్రెటరీ, పాలకవర్గం, ప్రజాప్రతినిధుల అహర్నిశలుగా కృషి చేయాలని, ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుండాల మండల వ్యాప్తంగా 11 గ్రామపంచాయతీల్లో గ్రామ సభలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు తూచా తప్పకుండా, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో, గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామ సభల్లో మండల అధికారులు ఎమ్మార్వో ఖాసీం, ఎస్ఐ రాహుఫ్, ఎంపీఓ రామకృష్ణ, ఎంఈఓ పార్వత, వైద్య, విద్యా, వ్యవసాయ అటవీశాఖ పలు శాఖల అధికారులను సమన్వయం చేస్తూనే గ్రామపంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించడం జరిగిందన్నారు. మేజర్ పంచాయతీలు అయిన గుండాల శెట్టిపల్లి సాయినపల్లి పంచాయతీలతో పాటు మిగిలిన పంచాయతీలోని పాలకవర్గంతో పాటుగా కార్యదర్శులు సైతం అహర్నిశలు విధులు నిర్వహించడం గర్వకారణమని కొనియాడారు.

వేసవి కాలంలో ప్రజలకు తాగు నీటి సమస్యలను తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. మండల అధికారులతో పాటుగా ఎంపీఓ రామకృష్ణ గ్రామ పంచాయతీల కార్యదర్శులు, పాలకవర్గం సభ్యులను అప్రమత్తం చేయడంలో నిమగ్నమయ్యారు. తూచా తప్పక విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు తోకల ఆకుల శ్యామ్సుందర్ రెడ్డి, తెపల మల్లేష్, బండారి నరేష్, చీమల జ్యోతి, వడ్లూరి సతీష్, పేనక ప్రతిప్, బండారి నరేష్, త్రిలోక్, సింగారపు రాజు, శరత్ చంద్ర, పాలకవర్గం సీతారాములు, కిషన్, భూక్య మంగమ్మ, కల్తి కృష్ణవేణి, కల్తి కృష్ణారావు, ఢిల్లీ వసంతరావు, ఈసం సుమలత, ఈసం సంజీవరావు, చింత వెంకటేశ్వర్లు, కల్తీ రాధా, కల్తీ రజిత, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, టీచర్లు, పలు ప్రభుత్వ శాఖ వ్యవసాయశాఖ, విద్యుత్ శాఖ, పోలీస్, వైద్యశాఖ, విద్యాశాఖ, రెవిన్యూ అటవిశాఖ తదితరులు పాల్గొనడం శుభ పరిణామమన్నారు.

Leave a Reply