Thandel బ్లాక్ బస్టర్ లవ్ సునామి…

నాగా చైతన్య – సాయి పల్లవి జంట‌గా న‌టించిన తాజా చిత్రం ‘తాండేల్’ ఇటీవలే విడుదల అయ్యింది. కాగా, ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకులను ఆకట్టుకుంది. యువ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తారు. దీంతో తాండేల్ చిత్రం నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది.

ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ‘బ్లాక్ బస్టర్ లవ్ సునామీ’ అనే ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు మూవీ మేకర్స్. అందులో భాగంగా రేపు విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలో ప్రేక్షకులతో కలిసి సినిమాని వీక్షించనున్నారు చిత్ర బృందం.

దర్శకుడు చందూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని అల్లు అరవింద్ స‌మ‌ర్పించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక‌ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన అసాధారణమైన సంగీతంతో సినిమాపై ఎఫెక్ట్‌ని రెట్టింపు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *