హైదరాబాద్, ఆంధ్రప్రభ (Andhra Prabha) : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్‌పాస్ ( bus charges) ఛార్జీలు పెరిగాయి. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ బస్ పాస్ ధరలను కూడా టీజీఆర్‌టీసీ ( TGRTC) పెంచింది. పెంచిన బస్ పాస్ ధరలు తక్షణం అమల్లోకి రానున్నాయి. 20 శాతానికి పైగా బస్ పాస్ రేట్లు పెరిగాయి. రూ. 1150 ఉన్న ఆర్డినరీ పాస్ ధర రూ. 1400కు పెంపు, రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ. 1600, రూ. 1450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ రూ. 1800కు పెంచారు.
విద్యార్థులకు కొత్త బస్ పాస్‌లకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో ఈ నెల 12న విద్యాసంస్థలు తెరవనున్న క్రమంలో విద్యార్థులకు కొత్తగా బస్సు పాస్‌లకు టీజీ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ (greater Hyderabad) పరిధిలో విద్యార్థులకు ఈ నెల 12 నుంచి కొత్త బస్ పాసుల ను జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. కొత్త బస్ పాస్ ల కోసం www.tgsrtc.telangana.gov.in/bus-pass-services వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.గ్రేటర్‌లో 40 కేంద్రాల ద్వారా పాస్‌లు నగర వ్యాప్తంగా 40 ఆర్టీసీ కేంద్రాల్లో విద్యార్థులు ఈ బస్ పాస్‌లను పొందవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
అనంతరం అప్లికేషన్ ఫామ్‌ను తీసుకెళ్లి విద్యార్థులకు దగ్గరలో ఉన్న బస్ పాస్ కౌంటర్లలో ఇస్తే.. స్టూడెంట్ బస్ పాస్ జారీ అందజేస్తారని.. ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహలక్ష్మి పథకం ఉన్నందున విద్యార్థినులు బస్ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

