అడవులను రక్షించడం అందరి బాధ్యత..

అడవులను రక్షించడం అందరి బాధ్యత..

కడెం, ఆంధ్రప్రభ : అడవులను వన్యప్రాణులను కాపాడుకోవడం అందరిపై బాధ్యత ఉందని ఉడుంపూర్ ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాస రెడ్డి అన్నారు ఖానాపూర్ ఎఫ్ డి ఓ శివకుమార్ ఆదేశాల మేరకు శనివారం కడెం మండలంలోని ఉడుంపూర్ రేంజ్ లో ప్రపంచ అటవీ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రేంజ్ పరిధిలో గల అటవీశాఖ అధికారులు ఉద్యోగుల సిబ్బంది ఉడుంపూర్ గండి గోపాల్ పూర్ మిద్ద చింత గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించి అడవుల ప్రాముఖ్యత గురించి గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు.

ఆక్సిజన్ ఉత్పత్తి మనం శ్వాస తీసుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ అడవులు ఉత్పత్తి చేస్తాయని వాతావరణ నియంత్రణ అవి కార్బన్ డయాక్సైడ్ గ్రహించడం ద్వారా భూమి యొక్క వాతావరణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయన్నారు వన్యప్రాణుల ఆవాసం అనేక జంతువులు మరియు మొక్కలకు నివాసాలను అందిస్తాయన్నారు ఆహారవనరులు పండ్లు గింజలు మరియు ఇతర ఆహార ఉత్పత్తులను అందిస్తాయని తెలిపారుఈ కార్యక్రమంలో కడెం ఖానాపూర్ ఎఫ్ఆర్ఓలు కిరణ్ గీతా రాణి డిఆర్ఓలు డి ప్రకాష్ ఏం ప్రకాష్ కడెం ఉడుంపూర్ ఖానాపూర్ రేంజ్ పరిధిలో గల ఎఫ్ ఎస్ ఓ లు ఎఫ్ బి ఓలు సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply