TG | మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా

TG | మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు గెలుస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు.

పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బలంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన అన్నారు.

ములుగు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన, బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ ముక్కలైందని, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం పరస్పరం తగువులు పడుతున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో ఇది ప్రతిఫలిస్తుందని మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply