TG | సర్పంచ్ ని సన్మానించిన విశ్వబ్రాహ్మాణ సంఘం..

TG | సర్పంచ్ ని సన్మానించిన విశ్వబ్రాహ్మాణ సంఘం..
TG, దండేపల్లి, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దండేపల్లి మండలంలోని మేదరిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా చొప్పదండి అనూష రాజేష్ చారి గెలుపొందడంతో మండలంలోని కాసిపేట, కొండాపూర్, ధర్మారావుపేట, గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘల ఆధ్వర్యంలో సంఘం నాయకులు మేదరి పేట గ్రామపంచాయతీ కార్యాలయంలో పూలమాలవేసి శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా మరింత ఎదగాలని విశ్వబ్రాహ్మణులకు అన్ని హక్కులను ప్రభుత్వం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వేమునూరి రవి చారి, ఉపాధ్యక్షులు రమేష్ చారి, లచ్చన్నచారి, తుపాకుల శేఖర్ చారి, లక్ష్మీనారాయణచారి, తిరుపతి చారి, మురళి చారి, రత్నచారి, రాజేష్ చారి, రాకేష్ చారి, సుధాకర్ చారి, రంగు శివకుమార్ చారి, మొగిలి చారి, పాలజి తిరుపతి చారి, సుద్దాల భాస్కర్ చారి తదితరులు పాల్గొన్నారు.
