హైదరాబాద్ – నేడు గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొననున్నారు.
వివిధ అంశాలపై… మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి గా నియమతులైన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, కులగణన సర్వే వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై కూడా ఈ మావేశంలో చర్చ జరిగే అవకాశముంది.
మీనాక్షి నటరాజన్ కు రైల్వే స్టేషన్ లో స్వాగతం
కాగా, నేటి సమావేశం లో పాల్గొనేందుకు నేటి ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న నూతన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్..కాచిగూడ రైల్వే స్టేషన్ లో మీనాక్షి నటరాజన్ కు ఘన స్వాగతం పకికారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఆయన వెంటప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ , ఫహీం ,రచమల్ల సిద్దేశ్వర్ తదితరులు ఉన్నారు..