హైదరాబాద్- మావోయిస్ట్ లతో శాంతి చర్చలు జరపాలని, అలాగే కర్రెగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని కోరుతూ శాంతి చర్చలు కమిటీ నిన్నముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన నేపథ్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హోంశాఖ మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి రేవంత్ వెళ్లారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం చర్చించారు..
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారు నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయయత్నించాలని జస్టిస్ చంద్రకుమార్ నేృత్వంలోని శాంతి చర్చల కమిటీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరింది.. ఈ సందర్భంగా . మావోయిస్టుల అంశాన్ని తాము సామాజిక కోణంలోనే చూస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో జానారెడ్డి సలహాలు తీసుకుంటామని కమిటీతో చెప్పారు. దీనిలో భాగంగానే జానారెడ్డిని కలిసి మావోయిస్ట్ ల సమస్యపై ఏం చేయాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.. శాంతి భద్రతల కోణంలో కాకుండా సామాజిక కోణంలో ఈ సమస్యను పరిష్కరించాలని జానారెడ్డి సూచించినట్లు సమాచారం .. దీంతో కేంద్రానికి వివిద అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాయాలని రేవంత్ భావిస్తున్నారు.