TG | కంచ గచ్చిబౌలి భూములపై ఫేక్ వీడియోలు … బిఆర్ఎస్ నేత క్రిశాంక్ కు నోటీసులు

హైద‌రాబాద్ – కంచ గచ్చిబౌలి భూములపై ఏఐని ఉపయోగించి కొన్ని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయడంపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు క్రిశాంక్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈనెల 9 , 10 , 11 న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఏఐని ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్టు చేసినందున కొన్ని ఆధారాలతో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నారు.

Leave a Reply