TG | ఎసిబి వలలో తలకొండపల్లి మండల రెవెన్యూ అధికారి నాగార్జున

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి (Talakondapally) మండల రెవెన్యూ అధికారి (MRO) నాగార్జున అవినీతి నిరోధక శాఖ(acb)కు చిక్కాడు. మండలం పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన ఒక రైతు (farmer)పొలం మార్పు చేయడం ఎమ్మార్వో ఆఫీస్‌కు వచ్చాడు. అయితే.. అందుకు అతడిని లంచం అడిగాడు ఎమ్మార్వో. రూ.1.50 లక్షలు డబ్బులు ఇస్తేనే పని జరగుతుందని చెప్పాడు.

దాంతో, మంగళవారం సాయంత్రం ఆ రైతు మొదటి దఫాగా రూ.10 రూపాయలు తహసీల్ధార్‌కు అందజేశాడు. అప్పటికే అక్కడ కాచుకొని ఉన్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న నాగార్జున ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Leave a Reply