TG |సొల్లు కబుర్లు మాని పాలనపై దృష్టి పెట్టు – రేవంత్ కు అరవింద్ క్లాస్

నిజామాబాద్ ప్రతినిధి : ఆంధ్రప్రభ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పనికిమాలిన రాజకీయాలు మానుకోనీ ప్రజా పాలనపై దృష్టి సారించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం కు హితవు పలికారు. కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి సీఎం సొల్లు పురాణం చేస్తున్నాడని మండిపడ్డారు.

ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారనే విషయమై స్పష్టత ఇవ్వా లని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ ధర్మ పురి అరవింద్ తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు . ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై పదేపదే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రం లో ప్రాజెక్టులకి అడ్డుపడు తున్నారని చెప్పడంలో వాస్తవం లేదన్నారు.

ప్రధా ని మోడీ మంచి వారే.. కానీ కిషన్ రెడ్డి మంచి వారు కాడు అని చెప్పడ మేమిటి అని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు సంబంధించి ఇవ్వాల్సిన స్థలాలను, అదేవిధంగా రాష్ట్ర ప్రభు త్వం ఇవ్వా ల్సిన వాటాని ఇస్తున్నావా.. రాష్ట్ర ప్రభు త్వం చేయాల్సిన ఫార్మా లిటీస్ అన్ని పూర్తి చేస్తు న్నావా అని సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలకు సమా నంగా నిధులు ఇస్తున్నా రని చెప్పారు. ఏక్కడ కూడా వివక్ష చూప లేద న్నారు. అసలు ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిస్తలేరు.. కిషన్ రెడ్డి ఏ విషయంలో అడ్డుకుంటు న్నా రనే దానిపై ప్రజల ముందుకు తీసుకురా వాలి కానీ సీఎం రేవంత్ రెడ్డి సొల్లు పురాణం చేయడమేమిటిని ప్రశ్నిం చారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో సీఎం సమాధానం చెప్పా లన్నారు.

కాంగ్రెస్ ప్రభు త్వం పై తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శిం చారు. ప్రధాని మోదీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అన్యా యం జరగలేదని తెలిపారు.ప్రాజెక్టులపై ప్రధాని మో డీని సీఎం రేవంత్ రెడ్డి కలవడం సంతోషమే కానీ రాష్ట్రంలో ప్రాజెక్టులకు అడ్డుకుంటు న్నారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభు త్వానికి సంబంధించి ప్రాజె క్టులు అడ్డుకుంటున్నారనే విషయమై అధికారులతో కలిసి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వస్తాం ప్రజల ముందే తేట తెల్లం చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సిఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *