TG | ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్..

TG | ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్..

TG, టేకుమట్ల, ఆంధ్రప్రభ : టేకుమట్ల మండలం ఎంపేడు గ్రామం నుండి జమ్మికుంట వరకు వయా వావిలాల మీదుగా నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘనంగా ప్రారంభించారు. ఈ కొత్త బస్సు సర్వీస్ ప్రారంభంతో ఎంపేడు, వావిలాల పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రజలకు జమ్మికుంటకు వెళ్లడం సౌకర్యవంతంగా మారనుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రవాణా సౌకర్యాల మెరుగుదల ముఖ్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆర్టీసీ అధికారులు, ఆ గ్రామ సర్పంచి ఈసంపల్లి హారిక, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply