TG | ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ – మెడికల్ రీయింబర్స్‌మెంట్ కు రూ 180.38 కోట్లు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ( Employee) , పెన్షనర్లకు(pensioners) భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌గా ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్( medical reimbursement ) బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేసింది.మొత్తంగా రూ.180.38 కోట్ల బిల్లులు విడుదల చేయడం ద్వారా దాదాపు 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ( Deputy CM bhatti Vikramarka ) ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలు కొనసాగుతుండగానే, ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రాధాన్యతతో పరిష్కరించారు. 2023 మార్చి 4 నుండి 2025 జూన్ 20 వరకు పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులను సమగ్రంగా పరిశీలించి ఈ మొత్తాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు, పింఛన్ హక్కుదారులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించాయి. ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబించిందని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం మారిన సందర్భాల్లో ఈ విధంగా వెంటనే స్పందించిన ఉదాహరణలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన వర్గాలకు న్యాయం జరుగుతుందని, భవిష్యత్తులో మరిన్ని సానుకూల చర్యలు కూడా ఆశించదగిన వాతావరణం ఏర్పడిందని ఉద్యోగులు, పింఛనర్లు తెలిపారు.

Leave a Reply