TG జగదీశ్‌ రెడ్డిపై సస్పెన్ష‌న్ ఎత్తివేయండి – స్పీక‌ర్ కు బిఆర్ఎస్ విన‌తి

హైద‌రాబాద్ : సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. స్పీక‌ర్‌ను క‌లిసిన వారిలో జ‌గ‌దీశ్ రెడ్డి, హ‌రీశ్‌రావు, కేటీఆర్, గంగుల క‌మ‌లాక‌ర్, పాడి కౌశిక్ రెడ్డి, కల్వ‌కుంట్ల‌ డాక్ట‌ర్ సంజ‌య్, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద‌, అనిల్ జాద‌వ్, చింతా ప్ర‌భాక‌ర్, మాణిక్ రావు ఉన్నారు.

శాననసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్ ఈ నెల 13న‌ అసెంబ్లీలో ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ సెషన్‌ పూర్తయ్యే వరకు సభ నుంచి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఈ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీశ్‌రెడ్డి సభకు హాజరయ్యే అవకాశం లేదు. దీంతో ఆయ‌న‌పై విధించిన స‌స్పెన్స‌న్ ను ఎత్తివేయాల‌ని బిఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు స్సీక‌ర్ ను అభ్య‌ర్దించారు.

Leave a Reply