గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్‌టీలు)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో చేసిన సమ్మె కాలానికి (21 రోజులు) వేతనాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. దీంతోపాటు మరణించిన సీఆర్టీల అంత్యక్రియల కోసం రూ. 30 వేలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి సీతక్క, తెలంగాణ ప్రభుత్వానికి సీఆర్టీలు ధన్యవాదాలు తెలిపారు.
TG | కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లకు గుడ్ న్యూస్..
