TG | ములుగులో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ !!

TG | ములుగులో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ !!

వాజేడు, ఆంధ్రప్రభ : తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం… కగార్ ఆపరేషన్‌ను వేగవంతం చేసింది. మావోయిస్టుల కదలికలు ఉన్న అడవి ప్రాంతాలను పూర్తిగా క్లియర్ చేయాలనే లక్ష్యంతో కీలక స్థావరాల ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో ములుగు జిల్లా వాజేడు మండలంలోని మురుమూరు గ్రామంలో, కర్రెగుట్టలకు చేరువగా కొత్త సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం ఈ స్థావరాన్ని సిఆర్పిఎఫ్ ఐజీ టి. విక్రమ్ అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఐజీ విక్రమ్ మాట్లాడుతూ,… కగార్ ఆపరేషన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ క్యాంప్ కీలక కేంద్రంగా ఉంటుందన్నారు. కర్రెగుట్ట ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు రోడ్డు సదుపాయాలు, లాజిస్టిక్ సపోర్ట్, ఆపరేషనల్ మోహరింపులు ఈ స్థావరం ద్వారా వేగంగా అమలు అవుతాయని పేర్కొన్నారు.

ఈ కొత్త స్థావరంలో 39వ బెటాలియన్‌కి చెందిన సుమారు 350 మంది సిబ్బందిని మోహరించనున్నారు. కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply