TG CM | దావోస్‌కు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

TG CM | దావోస్‌కు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి
TG CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి మేడారం వనదేవతల దర్శనం ముగిసింది. ఆయన హెలికాప్టర్‌లో నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సుకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు.
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలువురు గ్లోబల్ సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ టూర్ షెడ్యూల్‌లో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
