TG | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీకి ఆమోదం..

  • ఆర్థిక శాఖ అనుమతితో భర్తీ ప్రక్రియకు శ్రీకారం

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 118 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి మంజూరైంది. ఈ నియామక ప్రక్రియను రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు నిర్వహించనుంది.

అర్హత గల అభ్యర్థులను ఎంపిక చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు త్వరలో పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. అర్హత, వయోపరిమితి, పరీక్ష విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో తెలియజేయనున్నారు. అభ్యర్థులు తమ అర్హతలను తనిఖీ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Leave a Reply