TG | అకడమిక్ క్యాలెండర్‌ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలో జూన్ 12 నుంచి పాఠశాలలు (Schools)పున: ప్రారంభం (Reopen ) కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్‌ను {Academic Calendar) విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరంలో పరీక్షలు, సెలవుల తేదీలను వెల్లడించింది.

ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 2025 – 26 విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 230 వర్కింగ్‌ డేస్‌ {Working days)ఉంటాయని తెలిపింది.2025, జూన్‌ 12న క్లాసులు ప్రారంభం కానుండగా 2026, ఏప్రిల్‌ 23న లాస్ట్‌ వర్కింగ్‌ డేగా పేర్కొంది. జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఎస్‌ఏ 1 పరీక్షలు అక్టోబర్‌ 24 – 31 వరకు, ఎస్‌ఏ 2 ఏప్రిల్‌ 10 – 18 వరకు ఉంటాయి. మధ్య మధ్యలో ఫార్మెటివ్‌ అసెట్‌మెంట్‌ ఎగ్జామ్స్‌ ఉంటాయి.

దసరాకు సెప్టెంబర్‌ 21 – అక్టోబర్‌ 3 వరకు, క్రిస్మస్‌కు డిసెంబర్‌ 23 – 27 వరకు, సంక్రాంతికి జనవరి 11 – 15 వరకు సెలవులు ఉండనున్నాయి. విద్యార్థులకు సకాలంలో సిలబస్ పూర్తి చేసేలా పాఠశాల ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ఆదేశించింది.

టెన్త్‌ విద్యార్థులకు 2026 జనవరి 10లోపు సిలబస్‌ పూర్తి చేయాలని పేర్కొంది. అప్పటి నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు రీవిజన్ చేపట్టాలని సూచించింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు 2026 ఫిబ్రవరి 28లోగా సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించింది.

Leave a Reply