TG | రోడ్డు భద్రత మాసోత్సవాలు

TG | రోడ్డు భద్రత మాసోత్సవాలు
TG | ఆర్మూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు అర్మూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ రోడ్డు భద్రత మసోత్సవాలు నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్ పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ భవ్యశ్రీ, పట్టణ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్, ట్రాఫిక్ ఎస్సై రఘపతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్మూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్పర్సన్, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి మాట్లాడుతూ… జాతీయ భద్రత వారోత్సవాల భాగంగా ఈరోజు ఆర్మూర్ కోర్టు నుండి ర్యాలీగా ప్రజలు వాహనాలను జాగ్రత్తగా నడపాలని 18 సంవత్సరాల నిండిన యువత మాత్రమే వాహనాలు నడపాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ను తప్పక ధరించాలన్నారు. అదేవిధంగా కార్లు నడిపేవారు బెల్టు కచ్చితంగా ఉపయోగించాలని, వాహన చోదకులు మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. అతివేగంగా నడపడం వలన మనకన్నా ఎక్కువగా మన కుటుంబానికి ఇబ్బందిగా ఉంటుంది.. కావున వాహనాలు నడిపే యువత వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని నడపాలని, లేనట్లయితే మీతో పాటు మీ కుటుంబానికి సైతం ఇబ్బందులు కలుగుతాయన్నారు.
వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి రహదారి నియమాలు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ భవ్యశ్రీ మాట్లాడుతూ… రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరుగకుండా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్, న్యాయవాదులు, కిష్టయ్య, రమేష్, జి జి రామ్, చరణ్, మోహన్, బాబాగౌడ్, కిరణ్, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
