మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్ దీపక్ కుమార్

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్ దీపక్ కుమార్
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ 9వ వార్డ్ అమ్మ గార్డెన్స్ లో, మిషన్ భగీరథ పనులను శనివారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ పరిశీలించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ గుడిసెల సంధ్యారాణి రాజా రమేష్, కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ ముని, బొమ్మ భూమయ్య గౌడ్, రంగ లక్ష్మి రాజు, వార్డు ప్రజలు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.
