2వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ

2వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ
- ప్రారంభించిన కౌన్సిలర్ నిచ్చకోల వంశీకృష్ణ
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని 2వ వార్డులో మూడు నెలల కోటా రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం కౌన్సిలర్ నిచ్చకోల వంశీకృష్ణ ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు బియ్యాన్ని అందజేస్తూ పంపిణీ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా చూడటమే ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అని పేర్కొన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా, పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేయాలని ఈ సందర్భంగా ఆయన డీలర్‌ను ఆదేశించారు. మూడు నెలల రేషన్ ఒకేసారి అందడం పట్ల వార్డు ప్రజలు, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
