అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు తో విద్యుత్ సమస్య పరిష్కారం

అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు తో విద్యుత్ సమస్య పరిష్కారం

మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని 19వ వార్డు, 12వ వార్డులలో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో విద్యుత్ సమస్య పరిష్కారమయిందని మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. రెండు వార్డులలో నూతనంగా ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను 19 వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ తో కలిసి చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. వార్డులలో గృహిణులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ చైర్ పర్సన్ దృష్టికి, విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించిన అధికారులు యుద్ధప్రతిపాదికన నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ లను మంజూరు చేయించి ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమనీ, 19వ వార్డులో విద్యుత్ సమస్య లేకుండా చేయడమే కాకుండా, రాబోయే రోజుల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్,12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, నాయకులు మొగుదాల రమేష్ గౌడ్, దేప రాజు, ఊడుగు రమేష్ గౌడ్, సుర్వి నరసింహ, ఎస్ కే జానీబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్ గౌడ్, విద్యుత్ ఏఈ సతీష్ కుమార్, వర్కాల రాము గౌడ్, ఇప్ప వెంకటేష్, మలిగే మల్లేష్, రవితేజ, తదితర నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply