గర్భగుడిలో వేసవి కాలంలో ప్రత్యేక పూజలు..

గర్భగుడిలో వేసవి కాలంలో ప్రత్యేక పూజలు..
శ్రీ రామలింగేశ్వర ఆలయానికి రూ.50 వేల ఏ సి బహుకరించిన మార్కెట్ చైర్మన్
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో వేసవి కాలంలో ప్రత్యేక పూజలు,అభిషేకాల సమయంలో భక్తులకు ఇబ్బందుల దృష్ట్యా ఆలయ చైర్మన్ కోరిక మేరకు మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నూనేముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్ లు తక్షణమే స్పందించి రూ.50 వేల విలువైన ఏ సి (ఎయిర్ కండీషనర్) ను సోమవారం ఆలయ ప్రాంగణంలో చైర్మన్ రామచంద్రు గౌడ్ కి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ విమల వెంకటేశ్వర్లు దంపతులను శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బుర్ర యాదయ్య,క్రిష్ణ,ఉయ్యాల అంజయ్య,అవిశెట్టి అవిలిమల్లు, బయ్యని రాజు,బొల్లెపల్లి సీతయ్య,పట్టురి అంజయ్య,ఉప్పలయ్య,బందెల రవి ,తొట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
