గ్రంథాలయం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేత

గ్రంథాలయం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేత

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మండలంలోని ముచ్కూర్ గ్రామంలో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రామ యువత అనేకసార్లు గ్రంథాలయం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. యువత భవిష్యత్తును సరైన క్రమంలో మార్చుకొని ముందుకు వెళ్లే మార్గం కేవలం గ్రంథాలయం ద్వారా నిరుద్యోగ యువతను ప్రభుత్వ ఉద్యోగులుగా మరియు విద్యార్థులలో జ్ఞానాన్ని పెంపొందించే స్థలమే గ్రంథాలయం కాబట్టి గ్రామ ప్రజలకు రైతులకు పిల్లలకు ప్రతి మనిషి జ్ఞానాన్ని అభివృద్ధి చేసే గ్రంథాలయం కోసం గ్రామ యువత గత కొన్ని సంవత్సరాలు నుండి పోరాడుతూనే ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వం గ్రంథాలయం నిర్మాణం కోసం 12 లక్షల రూపాయలను కేటాయించింది.

గ్రామ యువత గ్రంథాలయ స్థలము కోసం స్కూల్ పక్కన విద్యకు సంబంధించిన భవనాలు అన్ని ఒకే దగ్గర ఉంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని యువత గ్రామ పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామపంచాయతీ పాలకవర్గం సానుకూలంగా స్పందించి తీర్మానం చేసి ఇస్తానని చెప్పినారు గ్రామ అభివృద్ధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నందుకు గ్రామపంచాయతీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినారు.. ఈ కార్యక్రమంలో గ్రామ యువత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Leave a Reply