సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి..

సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి..
మొక్కజొన్న క్షేత్రాలను సందర్శించిన ఏఓ
హసన్ పర్తి , ఆంధ్రప్రభ : రైతులు మొక్కజొన్న సేద్యంలో సమగ్ర యజమాన్య పద్ధతిలో భాగంగా సస్య రక్షణ చర్యలు చేపట్టాలని హసన్ పర్తి మండల వ్యవసాయ అధికారి అడ్లూరి అనురాధ సూచించారు.జాతీయ ఆహార భద్రత మిషన్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామంలో మొక్కజొన్న పంటక్షేత్రాలను వ్యవసాయ అధికారితోపాటు సిబ్బంది సందర్శించారు.
ఈసందర్భంగా అనురాధ మాట్లాడుతూ మొక్కజొన్నను మూడు సీజన్ లలో సాగు చేయవచ్చునని అన్నారు. తక్కువ పెట్టుబడుతూ అధిక లాభాలు సాధించవచ్చునని పేర్కొన్నారు. రైతులకు వివరించారు..తదుపరి ప్రదర్శనలో భాగంగా రైతులకు నీమ్ ఆయిల్, పీఎస్ బి, ట్రైకోడర్మా, ఆట్రాజైన్ తదితర పురుగు మందులను అందించారు.ఈకార్యక్రమంలో కమలాపూర్ మండల వ్యవసాయ అధికారి వేణు, హసన్ పర్తి ఏఈఓ ప్రవళిక, రైతులు భగవాన్ రెడ్డి,ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
