రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్..

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్..

మేడ్చల్, ఆంధ్రప్రభ : ముస్లిం సోదర సోదరీమణులకు ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ లావుడ్య శ్రీదేవి పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజులపాటు కఠిన ఉపవాస దీక్ష అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని తెలిపారు. అల్లా దీవెనలతో ప్రజలకు ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం సందర్భంగా నెలరోజులు కటిన ఉపవాస దీక్షతో, క్రమశిక్షణ ,ఆధ్యాత్మిక చింతన, ప్రేమా దయా సోదర భావం, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.

Leave a Reply