రైతుభరోసా ఒకేసారి అందించాలి..

రైతుభరోసా ఒకేసారి అందించాలి..

ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : రైతు భరోసాను విడతల వారీగా కాకుండా ఒకే సారి విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు యాసంగి పంట వేసే ముందు ఇవ్వవలసిన రైతు భరోసాను ఇప్పటి వరకు అందిచక పోవడం దారుణం అన్నారు. సకాలంలో రైతు భరోసా రాకపోవడం మూలంగా రైతులు పెట్టుబడి సహాయం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 22 వ తేదీన రైతు భరోసా 3 విడుతలు వారీగా విడుదల చేస్తామన్న ప్రభుత్వం,ఆ రోజు కేవలం ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేస్తే మిగిలిన రైతులు రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉందని,విడుతలుగా నిధులు విడుదల చేస్తే రైతులు అనేక ఇబ్బందులను పడుతారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఒకే విడుతలో రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.

Leave a Reply