తల్లిదండ్రుల ఎదుట తనువు చాలించిన సంఘటన..

తల్లిదండ్రుల ఎదుట తనువు చాలించిన సంఘటన..

నెక్కొండ, ఆంధ్రప్రభ : ఇంటి ముందు గజ్జల చప్పుడుతో చిన్నచిన్న అడుగులు వేస్తున్న చిన్నారి తల్లిదండ్రుల ఎదుట తనువు చాలించిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని లావుడ్య వాగ్య నాయక్ తండా శివారు భక్య తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బక్య తండాకు చెందిన లావుడ్య తిరుపతి సుజాత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె లావుడియా కుట్టి(3) ఇంటిముందు ఆడుకుంటూ స్నానాల గదిలోకి వెళ్ళింది. స్థానాల గది వద్ద నాగుపాము కాటేసింది. తల్లిదండ్రులు పాపకు దెబ్బ తగిలిందని గ్రహించి ఎత్తుకొని ఏడుపు తగ్గించడానికి ప్రయత్నించారు. ఇంతలో పాప నోటు నుంచి నురుసు రావడంతో స్థానాల గది వైపు వెళ్లి చూడగా నాగుపాము కనిపించింది. గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళుతున్న క్రమంలోనే మార్గమధ్యలో పాప మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

Leave a Reply