నాయకుల ముందస్తు అరెస్ట్..

నాయకుల ముందస్తు అరెస్ట్..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం నుంచి వివిధ గ్రామపంచాయతీల పరిశుద్ధ కార్మికులు, మల్టీ పర్సన్ వర్కర్ల సీఐటీయూ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా కారోబారి సంఘం మండల అధ్యక్షుడు చిట్యాల సంజీవ్ సహా పలువురు నాయకులను మంగళవారం ముందస్తు అరెస్టు చేసి అదుపు లో తీసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యల భాగంగా ఉన్నతాధికార ఆదేశాల మేరకు ముందస్తు అరెస్టు చేసి కొన్ని గంటలు స్టేషన్లో ఉంచి విడుదల చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
