బీటీ రోడ్డు బ్రిడ్జి పనులు ప్రారంభించాలని మంత్రికి వినతి..

బీటీ రోడ్డు బ్రిడ్జి పనులు ప్రారంభించాలని మంత్రికి వినతి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి బీటీ రోడ్డు,బ్రిడ్జిపనులు త్వరగా ప్రారంభించాలని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటిశ్రీహరిని మంత్రి క్వార్టర్స్ లో మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం కలిసి వినతిపత్రంసమర్పించారు. ఈ సందర్భంగా మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప మాట్లాడుతూ గత ఏడాది వర్షాకాలం భారీ వర్షాల కారణంగా రాకపోకలు స్తంభించుకోవడంతో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లగా బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి రూ. 2 కోట్లనిధులుమంజూరు చేసినట్లు తెలిపారు. నారాయణపేట -మక్తల్ ఆర్ అండ్ బి రహదారి నుండి మల్లేపల్లి నాగిరెడ్డిపల్లి గ్రామం వరకు బిటి రోడ్డు బ్రిడ్జి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభించాలని మంత్రిని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. మల్లేపల్లి మక్తల్ మండల పరిధిలోని సోమేశ్వర్ బండ గ్రామాలకు ప్రజలు విద్యార్థుల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రికివిజ్ఞప్తిచేసినట్లుతెలిపారు. అందుకు మంత్రి వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందించి బీటి రోడ్డు బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభిస్తానని, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించేందుకు హామీ ఇచ్చినట్లుతెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాములు , మల్లికార్జున్, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు.
