సిసి రోడ్డు పనులకు భూమి పూజ..

సిసి రోడ్డు పనులకు భూమి పూజ..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని సుంకేనపల్లి గ్రామంలో మంగళవారం ఈ జి ఎస్ నిధులు రూ 10 లక్షల తో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు చిట్యాల మండలం సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి గ్రామ సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య యాదవ్ ఆధ్వర్యంలో సిసి రోడ్డుకు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఆరవ వార్డులో మజీద్ వరకు సిసి రోడ్డు వేయిస్తానని, గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా విజయం సాధిస్తే మైనార్టీలకు మసీదు వరకు సిసి రోడ్డు వేస్తానని చెప్పడం జరిగిందని ఇప్పుడు సిసి రోడ్డు పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని, సర్పంచి తెలిపారు.
గ్రామ అభివృద్ధికి సిసి రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు సుల్బాంతరం అవుతాయా అని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని దశలవారీగా మౌలిక వసతులు కల్పిస్తూ ఆదర్శ గ్రామంగా చేయడానికి కృషి చేస్తానని సర్పంచ్ కావలసిన యాదయ్య తెలిపారు. పంచాయతీ కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యురాలు ఆవుల సోనీ, మచ్చ గిరి, నాగవచారి, లింగస్వామి, లింగం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
