తలుపులు తీయాలంటే టెన్షన్..

తలుపులు తీయాలంటే టెన్షన్..

  • ట్రేడ్ లైసెన్స్ తో ప్రొడక్షన్ పని.
  • ⁠వెలువడే పొగతో ప్రజా ఆరోగ్యం హరి.
  • ⁠నాలుగైదు కాలనీలకు వ్యాప్తి చెందుతున్న పొగ.
  • ⁠అధికారుల పై బూతులతో , తిరగబడుతున్న యజమాని పై ఆరోపణలు..

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మంలో ఇప్పటికే వాయు కాలుష్యం పెరిగింది. దానికి ఇండ్ల మధ్యలో బేకరి పేరుతో ఉత్పత్తి కర్మాగారం నెలకొల్పి ప్రజల ఊపిరితిత్తులకు ఎసరు పెడుతున్నాడని ఆరోపణలు.. తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఖమ్మం నగరానికి వలస వచ్చి తినుబండారాల ట్రేడ్ లైసెన్స్ పేరు పై ఏకంగా ఉత్పత్తి కేంద్రం ప్రారంభించాడు. బట్టి సిధ్దం చేసి పూర్తిగా ఒక షెడ్డును ఏర్పాటు చేసాడు. కట్టెల పొయ్యి నుండి వెలువడే పొగ ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు ఇతర కాలుష్య కారకాలతో కూడి ఉంటుంది. ఇది తీవ్రమైన శ్వాసకోశగుండె మరియు కంటి సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలు , పిల్లలు మరియు వృద్ధులలో ఆస్తమాఊపిరితిత్తుల వ్యాధులుమరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఇది ఇంటిగాలిని విషపూరితం చేస్తుంది..

కట్టెల పొగ కాలుష్యం వల్ల కలిగే ప్రధాన దుష్ప్రభావాలున్నాయి. శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పొగ పీల్చడం వల్ల ఆస్తమాబ్రోన్కైటిస్ మరియు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు సంక్రమిస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్ మరియు చిన్న సూక్ష్మ రేణువులు, గుండెపోటు మరియు అసాధారణ గుండె కొట్టుకోవడానికి కారణమవుతాయి. కంటి ఆరోగ్యం క్షీణిస్తుంది.పొగ వల్ల కళ్ళు పొడిబారడంఎరుపుదురదనీరు కారడం మరియు కంటిశుక్లం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. క్యాన్సర్ కారకాలు ఏర్పడుతున్నాయి. కట్టెల పొగలో బెంజీన్ఫార్మాల్డిహైడ్ వంటి క్యాన్సర్ కారకాలు ఉంటాయి. పర్యావరణంలో ఇది వాయు కాలుష్యాన్ని పెంచడమే కాకుండాగ్రీన్హౌస్ వాయువులను విడుదల చేయడం ద్వారా వాతావరణ మార్పుకు దోహదం చేస్తుంది. దాంతో మరణాల శాతం పెరిగితుంది.

ఇండ్ల మధ్య :- నివాసాలు ఉన్న చోట పెద్ద పొగ గొట్టం పెట్టి ప్రతి రోజు అతి సూక్ష్మ ధూళి కణాలు బయటకు వెదజల్లుతున్నాయి. దీని వల్ల శిశువులు నెలలు నిండక ముందే జన్మించే అవకాశం ఉంది. ఈ కాలుష్యం వల్ల నవజాత శిశువు మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. ప్రతి రోజు క్వింటా వరకు కట్టెలను వినియోగిస్తున్నాడని స్థానికులు పేర్కొన్నారు. ఆహర పదార్థాల తయారీకి పామాయిల్ నూనె వినియోగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో ప్రతిరోజూ నూనె కాలే వాసనతో పాటు చుట్టు ప్రక్కల ఇండ్ల పై బూడిద పడుతుంది. నల్లటి పొగ వెదజల్లడం కారణంగా గాలి ద్వారా ఇండ్లల్లోకి వచ్చే పొగతో ఫ్యాన్లు , అంతర్గత ఇంటీరియర్ నల్లగా మారుతున్నాయి. చుట్టు పక్కల ప్రజలు తలుపులు తెరిచి ఉంచే పరిస్థితి లేదు. ఆ ప్రాంతం మొత్తాన్ని కాలుష్యంతో నింపేస్తున్నాడు.

దౌర్జన్యం బెదిరింపులు…

పొగ వ్యాప్తిని నివారించి ప్రజా ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసే మున్సిపల్ అధికారుల పై దౌర్జన్యం చేస్తున్నాడనే సమాచారం. అధికారులకు ఆంక్షలు పెడుతున్నాడని కనీసం అధికారులు అనే గౌరవం కూడా లేకుండా వ్యవహరిస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్నాట్లు తెలుస్తుంది. ప్రజా ఆరోగ్యం క్షీణిస్తుంటే.. విష వాయువులు వెదజల్లే పొగ గొట్టం తొలగిస్తామంటే చస్తానని అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలు. అక్కడి ప్రజలు ఎవరైనా మాట్లాడితే వారి పై నోరు పారేసుకోవడం , బూతులు తిట్టడం , నిరాధార ఆరోపణలు చేయడం చేస్తున్నాడు. దాంతో అక్కడ పేద , బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి.

విష గొట్టం తొలగించాల్సిందే

సామాన్య ప్రజల ప్రాణాలను , ఆరోగ్యాన్ని నాశనం చేసే పొగ గొట్టాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలి. వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే వ్యాపారం చేయాలి. ప్రజా ప్రాణాలకు విఘాతం కలిగించే పొగ గొట్టం పెట్టి అభ్యంతరం చెప్పే వారి పై దౌర్జన్యం చేస్తానంటే అతని పై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజా ప్రాణాలకు భరోసా కల్పించాలని చుట్టూ పక్కల స్థానికులు ప్రభుత్వం, అధికారులను వేడుకుంటున్నారు.. ప్రజల సమస్య తీర్చాలిసిన బాధ్యత ప్రజా ప్రభుత్వానికి ఉంది.

Leave a Reply