మొక్కలు నాటిన విద్యార్థులు..

మొక్కలు నాటిన విద్యార్థులు..

చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, మంగళవారం జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని చైన్ పాక ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం విద్యార్థులు చేపట్టారు. నాటిన మొక్కలు కాపాడేందుకు ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి ఫ్లెక్సీ ఫోటో ఏర్పాటు చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాంత మనోహర్ , పంచాయతీ కార్యదర్శి పవన్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొట్ల రమేష్ , అంగన్వాడీ టీచర్, ఆయా, విద్యార్థులు, పాల్గొన్నారు.

Leave a Reply