TG | నూతన కౌన్సిలర్ బొట్ల సంపత్ కు సన్మానం..

TG | నూతన కౌన్సిలర్ బొట్ల సంపత్ కు సన్మానం..

TG | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీకి 8 వ వార్డు నుండి నూతన కౌన్సిలర్ గా ఎన్నికైన బొట్ల సంపత్ ను పోచమ్మవాడలో స్థానికులు ఘనంగా సన్మానించారు. సంఘమిత్ర సంస్థ వ్యవస్థాపకునిగా సేవలందిస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహించి ప్రజల ఆదరణ పొంది ఇప్పుడు కౌన్సిలర్ గా సంపత్ ఎన్నిక కావడం హర్షణీయమని జిల్లా బిజెపి సీనియర్ నాయకులు మల్ రెడ్డి నరసింహారెడ్డి, జంపాల శ్రీనివాస్ అన్నారు. సబ్బని సుభాష్, శ్రీను, బొట్ల విశ్వం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తమ వార్డు పరిధిలోని ఓటర్ల ఇంటింటికి వెళ్లి కౌన్సిలర్ సంపత్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply