TG | రిజర్వేషన్లపై టెన్షన్!

TG | రిజర్వేషన్లపై టెన్షన్!
- ఆశావహుల తర్జనభజన
- ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అవుతుందని చర్చ
TG | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో రిజర్వేషన్లు ఏమవుతాయో అని ఆశావహులు ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. ఏ వార్డు ఏ రిజర్వేషన్ అవుతుందా అని తర్జనభజన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లే ఉంటాయా లేదా మార్పులు చేర్పులు జరుగుతాయా.. అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. వార్డుల రిజర్వేషన్లు మారితే మాజీ కౌన్సిలర్లు తాము ఎక్కడ పోటీ చేయాలని మారకపోతే ఉన్న స్థానంలోనే పోటీచేయాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఇతర రాజకీయ పార్టీలు కూడా రిజర్వేషన్ల ప్రకటన తర్వాత అభ్యర్థులను ఖరారు చేద్దామని ఆయా పార్టీల అధినేతలు యోచిస్తున్నారు. దీంతో రిజర్వేషన్ల ప్రకటన కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా ప్రస్తుతం మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి పట్టణ కేంద్రాల మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలలో మొత్తం 24 స్థానాలకు గాను ఎస్టీ జర్నల్ ఒకటి, ఎస్సీ జర్నల్ కు రెండు, ఎస్సీ మహిళకు ఒక స్థానం కేటాయింపు జరిగింది. బీసీ జర్నల్‌కు 4 మహిళా బీసీలకు నాలుగు చొప్పున ఇవ్వగా జర్నల్లో ఏడు జర్నల్ మహిళలకు ఐదు స్థానాలు కేటాయింపు జరిగింది. కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను ఎస్టీ జర్నల్ ఒకటి, ఎస్టీ మహిళా 1, ఎస్సీ జర్నల్ రెండు ఎస్సీ మహిళ ఒకటి చొప్పున కేటాయింపు జరిగింది.
బీసీలకు ఆరు జర్నల్, మూడు మహిళా జర్నల్‌కు ఆరు జర్నల్ మహిళలకు 5 స్థానాలు ఇచ్చారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులకు ఎస్టీ జర్నల్ 1, ఎస్సీ మహిళా ఒకటి, బీసీ జర్నల్ 3, బీసీ మహిళ మూడు, జర్నల్ 6, జర్నల్ మహిళలకు నాలుగు స్థానాలు వచ్చాయి. ఈ మూడు మున్సిపాలిటీల పరిధిలో రిజర్వేషన్లు పైవిధంగా రాష్ట్రంలో కేటాయింపులు జరిగాయి. చైర్మన్ స్థానాలు ఎవరికి అయితాయని ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. రిజర్వేషన్ల తేదీ ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది అనే చర్చ కూడా సర్వత్ర రాజకీయ వర్గాలలో అభ్యర్థులలో నెలకొన్నది ప్రభుత్వం ఎప్పుడు రిజర్వేషన్లను చేస్తారని ఎదురుచూస్తున్నారు.
