TG | మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం

TG | మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం
TG | అచ్చంపేట, ఆంధ్రప్రభ : మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలం ఉత్తరద్వారంగా భావించే శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15, 16 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్న మహాశివరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులను ఆలయ కమిటీ ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే స్వగృహంలో టిపిసిసి ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆయన సతీమణి, సిబిఎం ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ అనురాధ మేడంకు ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఈవో శ్రీనివాస్‌రావు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శివ కళ్యాణం, భక్తులకు ఏర్పాటు చేస్తున్న సౌకర్యాల వివరాలను ఎమ్మెల్యే దంపతులకు వివరించారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
